కర్నూలులో బాలికపై అత్యాచారం.. నోట్లో పురుగుల మందు పోసి.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలులో బాలికపై అత్యాచారం.. నోట్లో పురుగుల మందు పోసి..

October 24, 2020

Police Case

కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. 15 సంవత్సరాల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేందుకు బలవంతంగా నోట్లో పురుగుల మందు పోశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో ఇది జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

స్కూలు సెలవులు కావడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పొలం పనుల కోసం తల్లిదండ్రులు వెళ్లిపోయారు. ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. బలవంతంగా లైంగిక దాడి చేశారు. పక్కింటి బాలుడు ఆ దారుణాన్ని చూసి కేకలు వేయడంతో పరారయ్యారు. అంతకు ముందే ఆమెకు బలవంతంగా గడ్డిమందు తాగించారు. ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా మార్పు రావడం లేదని వాపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.