ప్రేమజంటకు అండగా ఉన్నాడని హత్య - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమజంటకు అండగా ఉన్నాడని హత్య

June 2, 2020

Kurnool lovers youth attacked .jp

ప్రేమజంటకు అండదండగా నిలిచిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు అతణ్ని దారుణంగా కొట్టి వదిలేశారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఈ దారుణం జరిగింది. రుద్రవరం గ్రామానికి చెందిన యువతీయువకులు ప్రేమలో ఉన్నారు. దీనికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అబ్బాయిని మందలించారు. అయితే ప్రవీణ్ కుమార్ అనే యువకుడు ఆ జంటకు అండగా నిలిచాడు. 

వాళ్లిద్దరూ కలుసుకోడానికి కూడా  వీలు కల్పిస్తున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అమ్మాయి బంధువులు ప్రవీణ్‌పై కక్ష గట్టారు. అతణ్ని ఒంటరిగా దొరికించుకుని దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. రక్తం పోవడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.