కర్నూలు మేయర్ వార్నింగ్.. వీపులు వాయగొడతా.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలు మేయర్ వార్నింగ్.. వీపులు వాయగొడతా..

May 31, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మేయర్ బీవై రామయ్య వార్త పత్రికల విలేకరులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు వార్తలు తప్పుడు వార్తలు రాసిన, అధికారులు చెప్పని విషయాలు, చెప్పినట్లు క్రియేట్ చేసిన వీపులు వాయగొడతానని హెచ్చరించారు.

ఇటీవలే వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినప్పుడు, మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉందని ప్రజలు నీడ చాటుకు వెళితే, సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేశాయి. అలా రావటం వల్ల మీకేమి వస్తుంది? ఆ వార్త పత్రికల విలేకర్లు జనాలను చూసి కూడా అలా రాయటం ఎంతవరకు కరెక్ట్. ఇకనుంచి తప్పుడు వార్తలు రాస్తే, వీపులు వాయగొడతాం” అని ఆయన అన్నారు. మేయర్ బీవై రామయ్య చేసిన వ్యాఖ్యలు కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు విలేకర్లు ఆగ్రహించిన, మరికొందరు మాత్రం మేయర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు..