ఏపీలో దారుణం.. స్కూలు కప్పు కూలి పిల్లలకు తీవ్ర గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో దారుణం.. స్కూలు కప్పు కూలి పిల్లలకు తీవ్ర గాయాలు

April 28, 2022

ప్రభుత్వ ఆస్పత్రులను అత్యద్భుతంగా మెరుగు పరుస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన స్కూళ్లు పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ బాలుడి తలపై పెచ్చు పడి పగిలిపోయినంత పనైంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాడు నేడు పథకం కింద రాజకీయ నేతలు కాంట్రాక్టర్లే బాగుపడుతున్నారని జనం మండిపడుతున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పాత స్కూళ్లకు మరమ్మతుల పేరుతో నాటకం ఆడొద్దని, పసిబిడ్డల ప్రాణాలు తీయొద్దని కోరుతున్నారు.