కర్నూలు రాజకీయం సూద్దాం రారండి..! - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలు రాజకీయం సూద్దాం రారండి..!

July 10, 2017

మీరు ఏ సిన్మల సూడని ..ట్విస్టులు,పంచ్ డైలాగులు,క్లైమాక్స్ సీన్లు అన్ని గుడ ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలనే జర్గుతున్నయ్,అరరే ఏం  డైలాగులు,ఏం సవాళ్లు..ఇండ్ల మేన్ యాక్టర్లు ఎవలనుకుంటున్రు ఇంకెవలు…ఓదిక్కు టిడిపి మంత్రి భూమా అఖిల ప్రియ మేడం ఐతే ,ఇంకోదిక్కు  వైసిపి నేత శిల్పా మోహన్ రెడ్డి సారు. ఇద్దరు గుడ తమ పంచ్ డైలాగులతోని.. పర్ఫామెన్స్ తోని ”నంద్యాల ఉప ఎలక్షన్లు” అనే సినిమాను రసవత్తరంగ నడిపిస్తున్నరు.

సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోవడంతోని నంద్యాలల బై ఎలక్షన్లు వచ్చినయ్,ఇగ టిడిపి తర్పునుంచి  అఖిల ప్రియ మేడం..ఆళ్ల కుటుంబంనుంచి భూమా బ్రహానందరెడ్డిని యాక్షన్ లోకి దించుతే,ఇంకో వైపు వైసిపి తమ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి అనెటాయ్నను..యాక్షన్లకు దింపిన్రు.ఈడికి సిన్మా ఫస్టాఫ్ రసవత్తరంగనే సాగింది..కనీ అప్పుడచ్చింది అస్సలు ఇంటర్వేల్ ట్విస్టు….అదేంటిందంటే,ఈ నంద్యాల ఎలక్షన్ల టిడిపి ఓడిపోతే తను తన మంత్రి పదవికి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..మొత్తం రాజకీయాలనుంచే తప్పుకుంటానని మంత్రి అఖిల ప్రియ మేడం సవాల్ జేశింది,ఇగ  వైసిపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి సారు గుడ…నువ్వు గామాటమీదే నిలవడు …ఒకవేళ వైసిపి ఓడిపోతే  నేనుగుడ రాజకీయ సన్యాసం తీస్కుంట అని అఖిల ప్రియ మేడంకు ప్రతి సవాల్ జేశిండు…సూశిన్రా సిన్మ ఎంత ఇంట్రస్టింగ నడుస్తుందో….కనీ గీళ్ల సిన్మ జూస్తున్న ప్రేక్షకులు గదే గాడి పబ్లిక్కు ఎవ్వల్కి ఓటు గుద్దాల్నో అర్ధమైతలేదట,ఎందుకంటే గీ సవాళ్లు జేస్తున్న గీ నేతలంత..ఇంతకు ముందు ఆ పార్టీలకేలి ఈ పార్టీలకు..ఈ పార్టీలకేలి ఆ పార్టీలకు జంపింగ్ జంపాంగ్ లేనాయే,

ఈ సిన్మ ఇంట్ల నడుస్తున్నదా మరి సిన్మ మొత్తం సీరియస్ అయితుంది  కమేడియన్లు ఎవ్వలు లేరు అన్కున్నడో ఏందో….ఉర్ములేని పిడ్గులెక్క టక్కన ఎంట్రీ ఇచ్చిండు లగడపాటి సారు,సారు గొప్పతనం గురించి అందర్కి తెల్సిందే కదా..పార్లమెంట్ల పెప్పర్ స్ప్రే అవుసరం ఎంతున్నదో అందర్కి తెలియజేశ్న మహానుభావుడాయే సారు గురించి తెల్వనిదేముంది,పైగా జ్యోతిష్యం జెప్పుట్ల సార్ను మించినోళ్లు ఎవలన్న ఉన్నరా…నంద్యాల ఎలక్షన్ల  ఖచ్చితంగా వైసిపియే గెలుస్తదని సర్వే జేపిచ్చి జోస్యం జెప్పుతున్నడు సారు.ఇంక నయ్యం  మీరు పోటీజెయ్యిన్రి తప్పకుండ మీరే గెలుస్తరు నా జోతిష్కానికి తిరుగులేదు అని కాంగ్రెసోళ్లకు సలహా ఇయ్యలే.

మరి సూడాలే నంద్యాల ఉప ఎన్నికలు అనే సిన్మ క్లైమాక్స్ ల ఏం జర్గుతననేది,సవాల్ జేశినట్టు  అఖిల ప్రియ మేడం,శిల్పా మోహన్ రెడ్డి సార్లు మాటమీద నిలవడ్తరా లేక్పోతే…అసలైన రాజకీయ నాయకులు అన్పిచ్చుకుంటరా అనేది.