పేదల తిరుపతి.. కురుమూర్తి జాతరపై పాట - MicTv.in - Telugu News
mictv telugu

పేదల తిరుపతి.. కురుమూర్తి జాతరపై పాట

November 6, 2019

‘అపర తిరుమల కొండ ఈ కురుమతి’ అంటూ కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి పబ్బతి పడుతూ మరో భక్తిరస పాటతో మీ ముందుకు వచ్చాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య  స్వయంభూవంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా వినుతికెక్కారు.  పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతర కన్నులపండుగగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తుతారు. ఇంత చరిత్ర కలిగిన కురుమతిపై ఓ పాటను గైకట్టి తీసుకువచ్చాం. 

ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించగా గోరటి వెంకన్న రచించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. ఈ పాట చూస్తే మీకు కురుమతి క్షేత్ర విశిష్టత గురించి కళ్లకు కడుతుంది. 

క్రింది లింకులో పాటను తిలకించండి.