ఆ ఆధార్ కార్డేదో ఇప్పించండి...! కుశ టీజర్.. ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఆధార్ కార్డేదో ఇప్పించండి…! కుశ టీజర్.. !

September 8, 2017

ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ’ జై లవకుశ’. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటీకై ‘జై, లవ’ టీజర్లు విడుదలై మంచి స్పందన వచ్చింది. ఇప్పడు మూడో టీజర్ కుశను విడుదల చేసింది చిత్ర యూనిట్. మూడు పాత్రల టీజర్లు ను వేరే వేరేగా విడుదల చేయడంతోపాటు మూవీపై భారీగా హైప్స్ పెరిగాయి.

కుశ టీజర్ లో తారక్’ ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డేదో నాకు ఇప్పించ్చేయండి బాబూ ‘అని తారక్ అంటుంటే. ‘దాన్ని ఆధార్ కార్డు అనరమ్మా గ్రీన్ కార్డు అంటారు’అని చెప్పడం ఫన్నీగా ఉంది. దాంతోపాటు ‘తారక్ కొట్టేయ్యడంతో పాటు కొట్టడమూ వచ్చురా’ అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే టీజర్ల మీద టీజర్ల తో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 నాడు టాకీస్లల్లకు రాబోతుంది. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో దర్శనమిస్తున్నాడు కాబట్టి.. నందమూరి అభిమానులకు పండగే పోన్రి.