Kusukuntla Prabhakar Reddy responded to the nomination program in munugodu
mictv telugu

నేను తాగినట్టు కనిపించడానికి కారణం అదే.. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధి

October 18, 2022

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొంటుండడంతో ఫలితం ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపింది. నామినేషన్ రోజు మంత్రి కేటీఆర్ వెంట రాగా, భారీ అనుచరగణంతో ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆ రోజు ప్రభాకర్ రెడ్డి తాగి వచ్చారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

తన ముందు డీజే సౌండ్, మరోపక్క ప్రచార వాహన సౌండ్ తన మొఖంపై పడడంతో కనఫ్యూజ్ అయ్యానని, తనను బద్నాం చేయడానికి తాగి వచ్చాననే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రోడ్డు రోలర్ గుర్తుపై తమ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం పట్ల స్పందించారు. ఆ గుర్తుతో ఈ సారి ఇబ్బంది ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే నెల 3న జరిగే పోలింగ్‌లో గెలిచి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాననే నమ్మకాన్ని వెలిబుచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి రంగాల్లో చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.