kusukuntla prabhakar reddy sworn in as mla
mictv telugu

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కూసుకుంట్ల

November 10, 2022

మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసారు. అసెంబ్లీ హాల్‌లో ఆయనచే స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కూసుకుంట్ల గెలుపుతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 104కి చేరుకుంది. మజ్లిసు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, BJPకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా సంచలం రేకెత్తించిన మునుగుడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల 10వేలకు పైగా మెజార్టీతో.. బీజేపీపై ఘన విజయం సాధించారు. మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు.. ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి. 2014-18లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పనిచేసిన కూసుకుంట్ల..మరోసారి అవకాశం దక్కించుకున్నారు. నల్గొండ జిల్లాలో వరుసుగా జరిగిన మూడు ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది.