విజయ్ ‘బీస్ట్’ సినిమాను నిషేధించిన అరబ్ దేశం.. కారణమేంటంటే - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ ‘బీస్ట్’ సినిమాను నిషేధించిన అరబ్ దేశం.. కారణమేంటంటే

April 5, 2022

 ‘బీస్ట్’ సినిమా

తమిళంలో టాప్ పొజిషన్‌లో ఉన్న దళపతి విజయ్ నటించిన తాజా సినిమా ‘బీస్ట్’. ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో నుంచి వచ్చిన అరబిక్ కుతు అనే పాట అనేక రికార్డులను క్రియేట్ చేస్తూ యూట్యూబ్‌లో 250 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఓ మాల్‌పై దాడి చేసిన టెర్రరిస్టుల నుంచి ప్రజలను ఎలా కాపాడారు? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ రా ఏజెంటుగా నటించిన ఈ సినిమాను అరబ్ దేశమైన కువైట్ తమ దేశంలో విడుదలవకుండా నిషేధం విధించింది. సినిమాలో పాకిస్థాన్ టెర్రరిస్టులు, హింసాత్మక సన్మివేశాలను తీయడం వంటి వాటి వల్ల అక్కడి సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇలాంటి విషయాల్లో కువైట్ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది. గతంలో కురుప్, ఎఫ్ఐఆర్ వంటి సినిమాలను కూడా నిషేధించింది.