Kuwait government is a shock to expatriates..those jobs are for them..
mictv telugu

ప్రవాసులకు కువైత్ సర్కార్ గట్టి షాక్..ఆ ఉద్యోగాలు వారికే..

September 16, 2022

గల్ఫ్ దేశం కువైత్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే భారతదేశం నుంచే కాక, ప్రపంచంలోని ఆయా దేశాల నుంచి వేలాది మంది ఉపాధి కోసం కువైత్‌కి వలస వెళ్లి, అక్కడే స్థిరపడిపోతుంటారు. అయితే, గతకొన్ని నెలలుగా కువైత్ సర్కార్ ప్రవాసులకు షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇన్నాళ్లూ ప్రవాసుల పట్ల ప్రేమ చూపించిన ప్రభుత్వం, రాను రాను కువైత్ దేశ ప్రజలకే ప్రాధాన్యత ఇస్తూ, ఉన్నతమైన ఉద్యోగాల నుంచి ప్రవాసులను తొలిగిస్తుంది. దీంతో కువైత్‌కి వెళ్లిన వలసదారులు నానా అవస్థలు పడుతున్నారు.

కువైత్ సర్కార్ ధోరణితో వలసదారులకు చుక్కలు కనిపిస్తున్నాయని వలసదారులు బెంబేలెత్తిపోతున్నారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రెండు రంగాల్లోనూ ప్రవాసుల స్థానాల్లో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే అన్ని కీలక శాఖల్లో పనిచేస్తున్న ప్రవాసుల ఉద్వాసన మొదలుపెట్టిన ప్రభుత్వం..ఇదే కోవలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న ప్రవాసులను తొలగించి, వారి స్థానంలో స్థానికులకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించాయి. అధిక జీతాలు చెల్లిస్తున్న ఈ పోస్టులను కువైటీ వాసులతోనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుందట. అంటే ఈ నిర్ణయం ప్రకారం..ఇక, కువైత్‌తో సాధారణ ఉద్యోగాలు వలసదారులకు, ఉన్నతా ఉద్యోగాలకు కువైత్ వాసులకు కేటాయిస్తారని స్పష్టం అవుతుందని ప్రవాసులు చర్చించుకుంటున్నారు.

ఇక, కువైత్‌లో భారీ సంఖ్యలో ప్రవాసులు ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దేశ జనాభా మొత్తం 4.6 మిలియన్లు ఉంటే, అందులో వలసదారులే 3.4 మిలియన్లు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కువైత్‌లో ఉద్యోగాలు చేస్తూ, అక్కడే స్థిరనివాసులు కూడా ఏర్పాటు చేసుకున్న భారతీయులు కూడా అనేకమందే ఉన్నారు. ఇన్నాళ్లు ఆనందంగా ఉపాధి కోసం కువైత్‌కి వెళ్లిన, వెళ్తున్న ప్రవాసులు ఇకపై కువైత్‌కు వెళ్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.