Kuwait to deport expats who protested over remarks against Prophet
mictv telugu

నిరసన తెలిపిన ముస్లింలను స్వదేశాలకు పంపేస్తున్న కువైట్

June 13, 2022

Kuwait to deport expats who protested over remarks against Prophet

బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కొన్ని ముస్లిం దేశాలు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో ముస్లిం దేశమే అయిన కువైట్ అందుకు భిన్నంగా స్పందించింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసన తెలిపిన విదేశీ ముస్లింలను దేశం నుంచి బయటికి పంపేస్తోంది. అంతేకాకుండా మళ్లీ తిరిగి తమ దేశానికి రావొద్దని స్పష్టం చేస్తోంది. తమ దేశంలో ఇలాంటి నిరసనలకు తావు లేదని ఈ చర్య ద్వారా ఆ దేశం చెప్పినట్లయింది.

పనిచేసుకోడానికి వచ్చిన ప్రవాసులు తమ దేశ నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడం సరికాదని కువైట్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసన చేసిన వారిని గుర్తించి, అదుపులోకి తీసుకుంటున్నామని, వారిని వారి సొంత దేశాలకు పంపిస్తామని అధికారులను ఉటంకిస్తూ కువైట్ వార్తా సంస్థలు వెల్లడించాయి. నిరసనల్లో పాల్గొన్న వారిలో భారత ముస్లింలే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలు ఆ వివరాలు వెల్లడించలేదు.