Kuwait to hire 1,000 women cleaning staff from India
mictv telugu

కువైట్ లో వెయ్యి మంది భారత మహిళా క్లీనింగ్ వర్కర్ల నియామకాలు

November 25, 2022

 

Kuwait to hire 1,000 women cleaning staff from India

ఎడారి దేశమైన కువైట్ భారత్ నుంచి వెయ్యి మంది మహిళలను క్లీనింగ్ వర్క్ కోసం నియమించనుంది. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ మొదలైనట్టు అధికారులు తెలిపారు. మన దేశంతో పాటు నేపాల్ కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పాఠశాలల్లో అవసరమైన క్లీనింగ్ సిబ్బందిని స్థానిక కాంట్రాక్టుల ద్వారా సంబంధిత శాఖ నియమించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి మందిని రిక్రూట్ చేయడం కోసం ఇండియా, నేపాల్ వెళ్లేందుకు ప్రత్యేకంగా విదేశీ కాంట్రాక్టు కమిటీలను ఆ దేశం ఏర్పాటు చేసింది. వారు త్వరలో ఇండియా, నేపాల్ లలో పర్యటించనున్నారు. కాగా, ఇప్పటికే అరబ్ దేశాల్లో భారతీయులు భారీ సంఖ్యలో పని చేయనుండడం తెలిసిందే.