తండ్రి చనిపోయినా గ్రౌండ్ వదలని మన్‌దీప్ సింగ్! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి చనిపోయినా గ్రౌండ్ వదలని మన్‌దీప్ సింగ్!

October 25, 2020

 

మన్‌దీప్ సింగ్

పంజాబ్ జట్టు ఆటగాడు మన్‌దీప్ సింగ్ తండ్రి శుక్రవారం రాత్రి మరణించారు. అయినప్పటికీ మన్‌దీప్ సింగ్ శనివారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మయాంక్ అగర్వాల్ గాయపడటంతో ఓపెనర్‌గా వచ్చి 14 బంతుల్లో 17 పరుగులు చేసాడు. 

దీంతో తండ్రి మరణించినప్పటికీ మ్యాచ్ ఆడడంతో క్రికెట్ పట్ల అతడికి ఉన్న అంకిత భావనకు పలువురు క్రికెట్ అభిమానాలు ఫిదా అవుతున్నారు. మన్‌దీప్ తండ్రికి నివాళిగా పంజాబ్ ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌ కట్టుకుని ఆడారు. మన్‌దీప్ ధైర్యాన్ని కొనియాడుతూ సచిన్, ఆకాష్ చోప్రా ట్విట్లు చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అలాగే పంజాబ్ జట్టు హైదరాబాద్ పై గెలిచి ఆ విజయాన్ని మన్‌దీప్ తండ్రికి అంకితం చేసింది.