laborers clashed in Nalgonda
mictv telugu

నల్గొండ డీఈవో ఆఫీసు వద్ద లోకల్, నాన్ లోకల్ గొడవ.. రాళ్లదాడి

October 2, 2022

నల్లగొండ జిల్లా కేంద్రం డీఈవో ఆఫీసు వద్ద గొడవ జరిగింది. కూలీలు లోకల్, నాన్ లోకల్ అంటూ పరస్పరం దాడులకు దిగి రాళ్లదాడికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అడ్డా కూలీల మధ్య డబ్బు విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. పలు వాహనాలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బీహార్ నుంచి వచ్చిన కూలీలు తక్కువ రేట్లకు పని చేస్తూ తమ పొట్ట కొడుతున్నారని లోకల్ కూలీలు వాపోయారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి కట్టడి చేయడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, తెలంగాణలో వేగంగా జరుగుతున్న ఆర్ధిక వృద్ధి దృష్యా.. బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యక్తులు వలస వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. తక్కవ ధరకు పని చేస్తుండడంతో చాలా మంది యజమానులు వారినే పనిలో పెట్టుకుంటున్నారు. ఫాంహౌస్‌లలో, పాడి పరిశ్రమలలో, బోర్ వెల్స్, హోటళ్ళు వంటి తదితర రంగాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.