Labor's bright luck, 2.83 carat diamond found while returning from the shop
mictv telugu

దారిలో వెళ్తుండగా దొరికిన వజ్రం.. రాత్రికి రాత్రే లక్షాధికారైన కూలీ

August 21, 2022

దారిలో నడిచి వెళ్తున్నప్పుడు చిల్లర డబ్బులు దొరికితే అదృష్టమనుకుంటారు మనలో చాలామంది. కానీ ఓ వ్యక్తికి ఏకంగా వజ్రం దొరికింది. దాంతో మొత్తం సీన్ మారిపోయింది. అప్పటి వరకు కూలీగా ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా లక్షాధికారైపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో చోటుచేసుకుంది. ఓ కిరాణా షాప్‌లో కూలీగా పనిచేసుకుంటున్న నందిలాల్ రజాక్… షాప్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ఓ తెల్లని రాయి కనిపించింది. దానిని సాధారణ రంగు రాయి కావొచ్చేమో అని అనుకున్నాడు.

దానిని సన్నిహితులకు చూపించగా వారంతా వజ్రంలా ఉందన్నారు. దాంతో రజాక్ తన స్నేహితులతో కలిసి వజ్రాన్ని తీసుకుని డైమండ్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. 2.83 క్యారెట్లు ఉందని తేల్చారు. అయితే అధికారులు త్వరలో ఆ వజ్రానికి వేలం వేసి ఆ డబ్బును రజాక్‌కు ఇవ్వనున్నారు. వజ్రం వేలం వేయగా అందిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని, ఏదైనా వ్యాపారం కూడా చేసుకుంటానని నందిలాల్ రజాక్ చెప్పారు.