కూలీ కూతురుకు అరుదైన గౌరవం..ప్రారంభోత్సవానికి ఆమే వీఐపీ - MicTv.in - Telugu News
mictv telugu

కూలీ కూతురుకు అరుదైన గౌరవం..ప్రారంభోత్సవానికి ఆమే వీఐపీ

November 12, 2019

ఇంజనీర్లు ఎన్ని ప్లాన్లు గీసినా.. ఎటువంటి డిజైన్ వేసినా దాన్నిచివరకు అమలు చేయాల్సింది మాత్రం కూలీలే. ఎంత పెద్ద చారిత్రక కట్టడం అయినా వారి చేతుల మీదుగానే జరగాలి. కానీ పని చేసిన కూలీలకు అంతా అయిపోయాక పెద్దగా గుర్తింపు ఉండదు. కేవలం గొడ్డు కష్టం చేసి వెళ్లిపోవడమే వాళ్ల పనిగానే ఉంటుంది. కానీ బెంగుళూరు రైల్వే అధికారుల చొరవతో భవన నిర్మాణ రంగ కూలీ బిడ్డకు అరుదైన అవకాశం దక్కింది. వీఐపీ హోదాలో పదేళ్ల చిన్నారి ఎస్క్‌లేటర్ ప్రాజెక్టును ప్రారంభించింది. 

Labourer's Daughter.

నగరంలోని రైల్వేస్టేషన్‌‌లో ఇటీవల ఎస్కలేటర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. దీంతో దాన్ని ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల 9వ తేదీన ఎంపీ పీసీ మోహన్‌ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే రోజు అయోధ్య తీర్పు రావడంతో ఆయన  ఆ కార్యక్రమానికి రాలేకపోయారు. అయితే తాను రాలేకపోయినా కూడా ప్రారంభోత్సవం ఆపవద్దని అధికారులకు సూచించారు. సామన్యులకు ఉపయోగపడే నిర్మాణం కాబట్టి జాప్యం చేయకూడదని పేర్కొన్నారు. 

ఆయన మాటలతో వెంటనే అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. సామన్యుల చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణంలో భాగం పంచుకున్న చాంద్‌బీ అనే మహిళ కూతురు బేగమ్మా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. దాని కోసం కష్టపడి పనిచేసిన వారికి ఈ విధంగా గుర్తింపు ఇచ్చినట్టుగా ఉండటంతో పాటు ప్రజలకు ఎస్క్‌లేటర్ అందుబాటులోకి వస్తుందని ఇలా చేశారు. ఇది తెలిసిన వారంతా అధికారులను ప్రశంసిస్తున్నారు.