Ladakh : Frozen lake marathon in Ladakh on February 20
mictv telugu

Ladakh : దేశంలోనే తొలిసారిగా.. గడ్డకట్టిన సరస్సుపై మారథాన్..

February 13, 2023

Ladakh : Frozen lake marathon in Ladakh on February 20

మామూలుగా పరుగుపందేలు రోడ్లమీదనో, లేదంటే అడవుల్లో సాహసయాత్రల పేరు మీదనో జరుగుతుంటాయి. కానీ మంచుకారణంగా గడ్డ కట్టిన సరస్సుపై పరుగు పందేలు నిర్వహించడం మీరు ఇంతకుముందెన్నడూ చూసి ఉండరు. మనే దేశంలో తొలిసారిగా ఇటువంటి మారథాన్ నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఎత్తయిన ఘనీభవ ఉప్పునీటి సరస్సు అయిన లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరోవరంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ మారథాన్ ప్రారంభం కానుంది. ‘ఫ్రోజెన్‌ లేక్‌ మారథాన్‌’ పేరుతో నిర్వహించే దీని కోసం భారత సైన్యం మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

13,862 అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు 700 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ప్రస్తుత శీతాకాలంలో ఇక్కడ మైనస్‌ 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంది. సైన్యంతోపాటు ఇండో – టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP) ఈ కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమై ఉన్నట్లు సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. 21 కిలోమీటర్ల ఈ మారథాన్‌ పరుగు లుకుంగ్‌ నుంచి మాన్‌ గ్రామం వరకు కొనసాగుతుంది. ఈ పోటీలో 75 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ మారథాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదు కానుంది. వాతావరణ మార్పులను ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈ మారథాన్‌కు ‘‘లాస్ట్‌ రన్‌’’ అనే పేరు పెట్టారులడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్-లే, టూరిజం డిపార్ట్‌మెంట్, లేహ్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి లడఖ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ దీనిని నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు మారథాన్‌ ఉపయోగపడుతుందని లేహ్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ బాలాసాహెబ్‌ సుసె తెలిపారు.