Ladakh: PM Modi reaches Kargil to celebrate Deepavali with soldiers
mictv telugu

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

October 24, 2022

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్లో సైనికులతో కలిసి పండుగ జరుపుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ సైనికులతోనే దీపావళి జరుపుకుంటున్నారు. అదే తరహాలో ఈ ఏడాదీ కార్గిల్ లోని సైనికులతో సంబరాలు చేసుకునేందుకు మోడీ కార్గిల్‌లో అడుగుపెట్టారు. అక్కడి సైనికులతో కలిసి దివాళీ జరుపుకునేందుకు ప్రధాని అక్కడికి వెళ్లినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. ఏటా దీపావళిని ప్రధాని మోడీ సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.

అంతకు మునుపు ప్రధాని మోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ అయోధ్య పర్యటన చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని రాముడిని కోరుకున్నట్టు తెలిపారు. మన దేశంలోని సంస్కృతి ఇంకెక్కడా లేదని కొనియాడారు.