అయోధ్య భూమిపూజ కోసం లక్షా 11వేల లడ్డూలు - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య భూమిపూజ కోసం లక్షా 11వేల లడ్డూలు

July 31, 2020

Laddoos Preparation For Ayodhya Foundation Stone

మరో ఐదురోజుల్లో అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతోంది. దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న రామ మందిరం నిర్మాణం పనుల కోసం ఆగస్టు 5న భూమి పూజ చేయనున్నారు. దీని కోసం ఏర్పాట్లు కూడా వేగంగా సాగుతున్నాయి. భూమి పూజ సందర్భంగా భారీ ఎత్తున లడ్డూలు కూడా తయారు చేయిస్తున్నారు.  1.11 లక్షల లడ్డూలను భక్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. రాందాస్ చావ్నీలో తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. 

ఈ లడ్డూలను ప్రత్యేక టిఫిన్ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. వీటిని అయోధ్యతో పాటు వివిధ తీర్థయాత్రల్లో పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భూమి పూజ జరిగే రోజున టైం స్క్వేర్‌లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జై శ్రీరాం అంటూ హిందీ, ఇంగ్లీషు బాషల్లో పౌరాణిక ప్రదర్శన నిర్వహించనున్నారు. కాగా ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 200 మంది వరకు అతిధులు పాల్గొననున్నారు.