ladeis should take care of their heart
mictv telugu

మహిళలూ మీకూ ఉంది ముప్పు, జర జాగ్రత్త

February 1, 2023

 ladeis should take care of their heart

ప్రస్తుతం హార్ట్ ఎటాక్ , కార్డియాక్ అరెస్ట్ సీజన్ నడుస్తోంది. ఈ మాట అనడానికి, వినడానికీ కూడా కటువుగా ఉన్నా పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలానే ఉన్నాయి. ఎందుకంటే మన కళ్ళముందే ఎంతో మంది సడెన్ హార్ట్ ఎటాక్ లతో చనిపోతున్నారు. సెలబ్రిటీల్లో ఈ మధ్ ఇదే కంప్లైంట్ తో ఎంతో మంది చనిపోయారు. కాబట్టి దీని గురించి అందరిలోనూ ఆందోళన పెరిగింది. మన గుండె ఆరోగ్యంగా ఉంటే, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉందని అర్థం. అలాగే మన గుండె బాగా పనిచేస్తుంటే మిగతా వ్యాధుల ముప్పు తక్కువగా ఉందని కూడా అర్థం.ఇది కేవలం పురుషులకు మాత్రమే వర్తించదు. ఆడవాళ్ళకు కూడా. మహిళలు తరచుగా వివిధ కారణాల వల్ల తమ గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది ఎంత మాత్రం మంచిది కాదు. గుండె, ఆడవాళ్ళు అయినా, మగవాళ్ళు అయినా ఒక్కటే. అది పనిచేసే తీరులో మార్పు ఉండదు. కాబట్టి పురుషులతో సమానంగా మహిళలూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడవాళ్ళల్లో గుండెపోటు కనిపిండం లేదు కాబట్టి రిస్క్ లేదు అనుకోవద్దు.

నిజం చెప్పాలంటే పురుషుల కంటే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. అయితే స్త్రీలకు ‘గుండెపోటు’ వచ్చినప్పుడు గుండె ఆగిపోయే అవకాశం ఎక్కువ. నిజానికి హార్ట్ ఎటార్ వచ్చిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు బతకడం చాలా కష్టం. కాబట్టి మహిళలు కూడా తమ హృదయాన్ని అర్థం చేసుకోవడం, దానిని నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. రక్తపోటు పెరగడం, ముఖ్యంగా ఛాతీ నొప్పి వంటి లక్షణాలను తేలికగా తీసుకోకండి.స్త్రీలు తన దైనందిన జీవితంలో చేసే రకరకాల తప్పులు ఆమె హృదయాన్ని బలహీనపరుస్తాయి. ఆ తప్పులు ఏంటి? ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అనుసరించడానికి ఏ మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం:

గర్భం రాకుండా ఉండటానికి, చాలా మంది మహిళలు క్రమం తప్పకుండా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటారు. ఈ టాబ్లెట్స్ సంతానోత్పత్తి రేటును మాత్రమే ప్రభావితం చేయవు దాంతో పాటు రక్తపోటు పెరగడం, గుండెమీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.ప్రెగ్నెన్సీ పిల్స్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయవు కానీ పరోక్షంగా గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది స్ట్రోక్ లేదా గుండెపోటుకు దారితీస్తుంది.

సిగరెట్:

ధూమపానం ఎవరికైనా గుండెను బలహీనపరుస్తుంది. ఆడవాళ్ళు 35 ఏళ్ళు పైబడినట్లయితే ధూమపానం గతంలో కంటే ప్రమాదకరం. సిగరెట్ మానేయడం వల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం 80% తగ్గుతుంది.

ఎక్సర్సైజ్:

ఆడవాళ్ళకు పనెక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు తమ శరీరం మీద శ్రద్ధ తీసుకోరు. అలాగే తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. 24 గంటలు పని, కుటుంబం, ఇతర విషయాల నిర్వహణలో గడుపుతారు. ఫలితంగా వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఇంటి పనితో ఎక్సర్సైజ్ అయిపోతుంది అనుకుంటే అది ఒట్టి భ్రమే. వాళ్ళు కూడా కంపల్సరీ వ్యాయామం చేయాల్సిందే. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అలా చేస్తే అన్ని రకాలుగా స్త్రీల ఆరోగ్యం బావుంటుంది.

బరువు:

ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరుగుతారు. బరువు పెరగడం పెద్ద సమస్య కాదు. కానీ అదే చాలాసార్లు సమస్య కూడా. ప్రసవం తర్వాత బరువు పెరగడాన్ని మహిళలు పట్టించుకోరు. గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరంగా ఉండేలా బరువును నియంత్రించుకోవడం కూడా ముఖ్యం.

ఒత్తిడి ,నిద్రలేమి:

ఉదయాన్నే ముందుగా లేచి చివరిగా నిద్రపోవడం – మహిళలు మాత్రమే చేస్తారు. రోజువారీ జీవిత చక్రంలో తగినంత నిద్లేని వాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే. దానివల్ల వారి శరీరం అలసిపోతుంది. అలాగే చిన్న చిన్న విషయాలు కూడా మహిళలను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తాయి.ఒత్తిడి ,నిద్ర రెండూ గుండె ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే మహిళలు రోజుకు కనీసం 7 -8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దీనికి ఇంట్లోని మగవారు కూడా సహకరించాలి. వాళ్ళు మగవారి మీద ఎలా శ్రద్ధ తీసుకుంటారో…అలాగే మగవారు కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద శ్రద్ధ తీసుకోవాలి.