గాలి జనార్ధన్ రెడ్డి కూతురునంటూ అడ్డంగా బుక్కైన మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

గాలి జనార్ధన్ రెడ్డి కూతురునంటూ అడ్డంగా బుక్కైన మహిళ

October 2, 2020

Lady Fake Clim Gali Janardhan Daughter

గాలి జనార్ధన్ రెడ్డి కూతురును అంటూ సినిమా స్టైల్‌లో ఓ మహిళ హల్‌చల్ చేసింది. తనకు  డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అడ్డంగా బుక్కైంది. కర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం కాకనూరులో ఇది జరిగింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ముఠాలోని మిగితా ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 

లంగర్‌హౌస్ ప్రాంతంలో ఉండే సంగీతరెడ్డి, ఆమె భర్త మహమ్మద్‌ నజీర్‌, వారి డ్రైవర్‌ శ్రీమన్నారాయణమూర్తి, అతని భార్య లక్ష్మి ఓ ముఠాగా ఏర్పడ్డా రు. గత నెల 25న గాలి జనార్ధన్ రెడ్డి మామ పరమేశ్వర్ రెడ్డి ఉండే కాకనూరుకు వెళ్లారు.  తాను 28 సంవత్సరాల క్రితం అనంతపురంలోని ఆసుపత్రిలో జన్మించానని చెప్పింది. అప్పట్లో జనార్థన్ రెడ్డి భార్య కవలలను ప్రసవించిందని పేర్కొంది. తను నర్సు అపహరించి, కొన్ని రోజుల తరువాత వేరే మహిళకు అప్పగించిందని, తాను మీ మనవరాలినేనని నమ్మించే ప్రయత్నం చేసింది. దీని కోసం కొన్ని ఫేక్ ఫోటోలను చూపించింది. రూ. 5 లక్షలు ఇస్తే ఈ విషయం ఎవరికి చెప్పనని తెలపడంతో అతనికి అనుమానం వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. డబ్బుల కోసమే తాను నాటకం ఆడానని నిజం ఒప్పుకుంది. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, కారు, మార్ఫింగ్ చేసిన ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు.