mictv telugu

దడ పుట్టిస్తున్న లేడీ రౌడీ…సెటిల్మెంట్లు, దందాలు…

February 11, 2019

సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ రౌడీలను, గూండాలను చూశాం. వాళ్ళంతా మగవాళ్ళే వుంటారు. కానీ లేడీ రౌడీలను చూశామా ? లేదుకదా.. సినిమాల్లో అడపాదడపా కొందరు లేడీ రౌడీలను చూశాం. నిజ జీవితంలో లేడీ రౌడీని చూడాలనుకుంటే బెంగుళూరు వెళ్ళాల్సిందే. అక్కడామె చెస్తున్న రౌడీయిజానికి స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు.

ఆమె ఒకత్తే కాదు. ఆమె వెనకాల గ్యాంగ్ కూడా వుంటుంది. వాళ్ళంతా కూడా మహిళలే అవడం విశేషం. బెంగుళూరులోని చెన్నమ్మన కెరె అచ్చుకట్టు ప్రాంతంలో వుంటుంది ఈ లేడీ కేడీ. ఆమె పేరు యశస్విని. బుల్లెట్ మీద దర్జాగ మర్కెట్లోకి వస్తుంది. ఆ ప్రాంతంలో ఆమె చెప్పిందే వేదం. ఎవరైనా ఎదురు తిరిగితే వారికి పుట్టగతులు లేకుండా చేస్తుంది. తనవెంట లేడీ గ్యాంగును పెట్టుకుని మరీ స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తోంది.Lady Roudy sheeter, Yashaswini, BanLady Roudy sheeter, Yashaswini, Bangalore, Gang, Police case, Crime, People are shyeime, People are shyeఈ క్రమంలో ఆమెపై చాలామంది పోలుస్ స్టషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో పోలీసులు ఆమెపై రౌడీషీట్ తెరిచారు. దీంతో ఆమె నగరంలోని ఉత్తర ప్రాంతానికి తన మాకాం మార్చింది. అక్కడ కూడా తన ఆగడాలను కొనసాగిస్తోంది యశస్విని.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను కోర్టుకు హాజరుకావాలని కోరారు. కేసులో విచారణ సందర్భంగా కోర్టుకు హాజరవుతోంది యశస్విని. తనపై కేసు పెట్టిన లలితపై పీకల్లోతు కక్ష పెంచుకుంది యశస్విని.
ఈ క్రమంలో చివరి విచారణకు హాజరవుతున్న బాధితురాలు లలితను మార్గమధ్యంలోనే తన 8 మంది మహిళా అనుచరులతో అడ్డుకున్నారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికీ తుసుకువెళ్ళి తీవ్రంగా కొట్టి అక్కణ్ణుంచి పారిపోయారు.

తీవ్ర గాయాలతో లలిత పోలీసులను ఆశ్రయించింది. వెంటనే ఆమెను వైద్యంకోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశస్విని కోసం గాలిస్తున్నారు.