ఒడిశాలోని భువనేశ్వర్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఓ మహిళా ఎస్సైపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఆమె విధులు ముగించుకొని రాత్రి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను కత్తులు, తల్వార్లుతో వెంబడించారు. ఆమెపై అసభ్యకర మాటలు ఆడుతూ ఫాలో అయ్యారు. ఈ రోజు మా చేతుల్లో అయిపోయావంటూ బెదిరించారు. అయితే వారి నుంచి ఎస్సై శుభశ్రీ తెలివిగా తప్పించుకున్నారు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి రిజర్వ్ బ్యాంకు సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శుభశ్రీ నాయక్‌కు డిపార్డ్ మెంట్ లో మంచి పేరుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆమె పలువురికి సాయం అందించారు. అప్పట్లో ఆమె సేవలను మెగాస్టార్ చిరంజీవి సహా..కొందరు ప్రముఖులు కొనియాడారు.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు భద్రత కరువైంది. దేశంలో ఎక్కోడ ఓ దగ్గర ప్రతిరోజు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు దాడులు జరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా…శిక్షలు అమలు చేసినా నేరాలకు అడ్డుపడడం లేదు. తాజాగా మహిళా పోలీస్ అధికారిని కత్తులతో వెంబడించడంతో చర్చనీయాంశమైంది.