మాళవిక మోహనన్, నయనతార మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. ‘లేడీ సూపర్ స్టార్’ అంటూ ఏదో వ్యాఖ్యలు చేసింది. అయితే నయనతార ఈ మాటలను సీరియస్ గా తీసుకొని మాళవిక మీద మాటల దాడికి దిగారు. దీంతో మాళవిక వెనక్కి తగ్గి వివరణ ఇచ్చింది.
మాస్టర్ సినిమాలో మెరిసిన మాళవికా మోహన్ తన కొత్త చిత్రం క్రిస్టి ప్రమోషన్స్ లో ఒక మలయాళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఏదో ప్రశ్నకు తనకు ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలిపించుకోవడం, అసలు ఆ పిలుపంటేనే నచ్చదు అని అంది. అంతటితో ఆగలేదు ఆమె మాటలు. మగవాళ్లను పిలిచినట్టే తనను సూపర్ స్టార్ అంటూ పిలువాలని కూడా అంది. ఈ మాటలు నయనతార ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో మాళవిక తన మాటలకు సోషల్ మీడియాలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
గతంలో కూడా..
మాళవిక.. నయనతారను ఉద్దేశించి మాట్లాడడం ఇది మొదటిసారేం కాదు. ఒక ఇంటర్వ్వ్యూలో.. ‘నేను లేడీ సూపర్ స్టార్ సినిమా చూశా. అందులోని ఆసుపత్రి సీన్ లో ఆమె ఫుల్ మేకప్ తో ఉంది. ఆ సీన్ చూసి షాకయ్యా’ అంటూ కామెంట్ చేసింది. దీనికి నయనతార కూడా స్పందించింది. మామూలుగా నయనతార ఇంటర్వ్యూలు ఇవ్వదు. కానీ మొదటిసారి కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో.. ‘దర్శకుడు చెప్పిందే నేను చేశాను. కమర్షియల్ సినిమాకి, రియలిస్టిక్ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ గానే ఉండాలి. కానీ కొన్ని సినిమాలకు సీన్ కు అనుగుణంగా మారాలి. ఇది కొంతమంది తెలుసుకోవాలి’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
వివరణ..
ఈ లేడీ సూపర్ స్టార్ గొడవపై నటీమణులకంటే వారి ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మాళవిక మీద పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ నటి.. ‘నటీమణులందరినీ ఉద్దేశిస్తూ ఆ పదాన్ని ఉపయోగించి ఆ పదాన్న అన్నాను. అంతేకానీ ఒక హీరోయిన్ ని ఉద్దేశించి మాత్రం కాదు. నాకు నయనతార అంటే చాలా ఇష్టం. ఆమెను ఒక సీనియర్ గా భావిస్తాను. ఆమె నటన నుంచి ప్రేరణ పొందుతాను. దయచేసి అందరూ శాంతించండి’ అంటూ పోస్ట్ పెట్టింది. మరి చూడాలి.. ఈ పోస్ట్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చుతుందో.. లేదో?!