ఏం టాలెంట్ గురూ.. తలపై పాల గ్లాసుతో స్విమింగ్.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఏం టాలెంట్ గురూ.. తలపై పాల గ్లాసుతో స్విమింగ్.. (వీడియో)

August 4, 2020

Lady Swim With Full Glass of Milk on Head

నిండు పాల గ్లాసు తొనకకుండా చేతితో పట్టుకెళ్లాలంటేనే చాలా నమ్మదిగా వెళ్తాం. అలాంటిది తలపై ఏ ఆధారం లేకుండా ఈత కొడుతూ.. ఓ యువతి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు..23 ఏళ్ల వయసులోనే 5 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించిన క్యాటీ లెడెస్కీ.  చాక్లెట్ పాలతో నిండిన గ్లాస్‌ను తలపై పెట్టుకొని స్విమ్మింగ్ పూల్‌లో అటు నుంచి ఇటూ వరకు వెళ్లింది. ఏ మాత్రం పట్టు తప్పకుండా చేసిన ఈది సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ వీడియోను  ఆమె తన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సీనియర్ స్విమ్మర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

పాల గ్లాస్ నుంచి ఒక్క చుక్క కూడా కింద పడకుండా  పడకుండా ఈదాలన్నదే ఆమె టార్గెట్. చాలా జాగ్రత్తగా ఈదుకుంటూ టాస్క్ పూర్తి చేసింది.  12 గంటల్లో 28 లక్షల మంది దీన్ని చూశారు. మనమూ ఆ లిస్టులో చేరిపోదాం. టిక్‌టాక్‌లోని గాట్ మిల్క్ చాలెంజ్ కోసం దీన్ని చేసినట్టుగా చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లో ఇదో బెస్ట్ స్విమ్ అని క్యాటీ పేర్కొంది. అంతే కాకుండా ఇలా మీరెవరైనా చేశారా అంటూ ప్రశ్నించింది. కాగా ఒలింపిక్స్‌తో పాటు 15 ప్రపంచ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్స్ కూడా ఆమె సొంతం చేసుకుంది. ఈసారి ఇలా సరికొత్తగా పద్దతిలో ఈదడం అందరిని ఆకట్టుకుంటోంది.