పెళ్లి పేరుతో ఎన్నారై యువకుడికి గాలం.. లక్షలు దొబ్బేసింది - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి పేరుతో ఎన్నారై యువకుడికి గాలం.. లక్షలు దొబ్బేసింది

October 22, 2020

Lady who cheated NRI youth in the marriage praposal and hit lakhs

మ్యాట్రిమోనీలో తనకు తగ్గ అమ్మాయిని వెతికి పెళ్లి సెట్ చేసుకుందాం అని భావించాడు ఓ ఎన్నారై యువకుడు. ఈ క్రమంలో ఓ మాయలేడి అతనికి మ్యాట్రిమోనీలో పరిచయం అయింది. అతనికి లేనిపోని అబద్ధాలు చెప్పి బాగా నమ్మించింది. ఓ ఫేక్ పేరుతో అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తన ఉచ్చులో పడ్డాడనుకుని తన అకౌంట్‌లో రూ.7.20 లక్షలు వేయించుకుని చెక్కేసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.  

ఓ మ్యాట్రిమొనీ సంస్థలో తన వివరాలు నమోదు చేసుకున్నాడు ఓ యువకుడు. తెనాలికి చెందిన అతడు అమెరికాలో ఉంటున్నాడు. అయితే ఆ యువకుడిని ఓ అమ్మాయి పరిచయం చేసుకుంది. తన పేరు మైనేని సముద్ర అని, తన స్వగ్రామం ప్రకాశం జిల్లా ఉలవపాడు అని తెలిపింది. న్యూయార్క్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించింది.

నెల వేతనం లక్షా 10 వేల డాలర్లు అని.. హెచ్-1 వీసా కూడా ఉందని బుకాయించింది. ఈ క్రమంలో 13 రోజుల క్రితం తెనాలిలోని యువకుడి తాతయ్యను.. మైనేని శ్రీనివాస్, దేవి అనే ఇద్దరు సంప్రదించారు. తాము చెన్నైలో ప్రొఫెసర్లమని, తమ కూతురు సముద్ర న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోందని చెప్పారు. సముద్ర పేరు మీద ఉలవపాడులో 25 ఎకరాల భూమి ఉందని కూడా చెప్పారు. దీంతో సదరు యువకుడు ఆమెను బాగా నమ్మాడు. పెళ్లి చేసుకుందాం అని చెప్పి, పెళ్లి ఖర్చుల కోసం అని తన ఖాతాలో రూ.7.20 లక్షలు వేయించుకుంది. ఆ తర్వాత పెళ్లి సంబంధం మాట్లాడుకునేందుకు ఆ యువకుడి కుటుంబసభ్యులు ఉలవపాడు గ్రామం వెళ్లారు. వారు అక్కడ మైనేని సముద్ర గురించి వాకబు చేశారు. అయితే అక్కడ ఆ పేరుగల అమ్మాయి ఎవరూ లేరని స్థానికులు చెప్పారు.  దీంతో వారు షాక్ అయ్యారు. ఈ విషయం కొడుకుకు చెప్పగా, తాను మోసపోయానని ఆ యువకుడు గ్రహించాడు. వెంటనే ఆ కిలేడీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.