ఆంధ్ర ఆక్టోపస్ చెప్పిందే జరిగింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్ర ఆక్టోపస్ చెప్పిందే జరిగింది..

August 28, 2017

పెప్పర్ స్ప్రేను పార్లమెంట్ లో  తొలిసారిగా ప్రవేశ పెట్టిన ఘనుడు.. రాష్ట్రం విడిపోతే  రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని.. కాళ్లమీదే కాదు మాటమీద  నిలబడ్డ  వ్యక్తి… ఆయనే  శ్రీ లగడపాటి రాజగోపాల్. ఆయన  చెప్పిన జోస్యం మల్లోపారి నిజమైంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపీయే గెలుస్తుందని ఆయన సర్వేజేసి చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆయన జోస్యం నిజమైంది. వైకాపై టీడీపీ ఘనవిజయం సాధించింది. రాజకీయాలలో రాజగోపాల్ అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. గతంలో కూడా చాలా ఎన్నికల్లో ఆయన చెప్పినట్టే  జరిగింది. ఎవరు సర్వే చేసిన పెద్దగా పట్టించుకోరుగాని.. లగడపాటి సర్వే కు మాత్రం ఒక లెక్క ఉంటుంది.. ప్రతిపక్షం కాదు అధికార పక్షమైన సరే ఆయన సర్వే పై అంత నమ్మకం ఉంటుంది.. లగడపాటి లెక్కలను మీడియాతో సహా మోడీ, సోనియా కూడా నమ్ముతారనే పబ్లిక్ టాక్ ఉంది

లెక్క తప్పిన కేసీఆర్ జోస్యం…

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని  కేసీఆర్ మీడియాతో జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు జాతకం నంద్యాలలో పోలింగ్ జరిగే తేదీ, ఫలితం వచ్చే తేదీ ఆధారంగా  అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలున్నాయని తన సన్నిహిత జోతిష్యులు చెప్పినట్టు  కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.కానీ  ఈరోజు వచ్చిన  ఫలితాలతో  ఆయన జోస్యం లెక్క తప్పిందనే చెప్పాలి. ఎవరు ఎన్ని  జోస్యాలు  చెప్పినా కూడా ఆఖరికి  పబ్లిక్  ఇచ్చే తీర్పును మాత్రం  ఎవరైనా ఊహించడం కష్టం అనేది వాస్తవం.