అన్నీ ముచ్చట్లూ ఈయనకే కావలి.... ఎంటో ఈయన గారి స్టోరీ... - MicTv.in - Telugu News
mictv telugu

అన్నీ ముచ్చట్లూ ఈయనకే కావలి…. ఎంటో ఈయన గారి స్టోరీ…

August 24, 2017

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. లగడపాటి నీవు నిజంగా తోపే.   అవసరం ఉన్నా లేకున్నా… అడిగినా అడగకున్నా.. తన కుషీ కోసం  చేసుకున్నా కోట్లాది మంది ప్రజల ఆసక్తులను ఇట్టే  గుర్తించి వారి కోరిక తీర్చేస్తాడు. ఆయన జనాలుక ఉచితంగా ఆనందం పంచగలడు…  ఆందోళనా చేయగలడు. మరిప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆయనే సర్వే చేయించినట్లుంది. ఎప్పటి మాదిరిగానే  ఓటింగ్ కంటే ముందే ఫలితం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడీపి గెలుస్తుందని అంటున్నారు. పైగా రేపటి కల్లా మెజార్టీతోసహా చెప్తానని అంటున్నారు.

ఇంతకు ముందు  జరిగినపలు ఎన్నికల్లో కూడా లగడపాటి వారు సర్వేలు  చేయించారు. పార్టీలు  ఊరికే ఉంటే చాలు… ఈయనే అన్ని చూసుకునేలా ఉంది. ఎవ్వరూ అడిగినా అడగకున్నా ఆయన మాత్రం పక్క వారి కోసం… వారి కష్టానికి ఫలితం ఎట్లా ఉంటుందనే విషయాన్ని చెప్పేస్తారు.  ఎన్నికల ముందు ఆ తర్వాత తాము చేయించుకున్న సర్వేల కన్నా లగడపాటి సర్వేనే నమ్ముతున్నట్లుంది.

కిందటి సాధారణ ఎన్నికల్లోకూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తుందనే విషయంపై ఆయనే ముందుగా చెప్పారు. ఎవరికెన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. ఇట్లా ప్రతీ సందర్భంలో లగడపాట వారి జోస్యం ఉంటుంది. ఈ సారి అట్లాగే చెప్పారు.

ఏదైమనా ఎవ్వరు అడిగినా అడగకున్నా ఉన్న టెన్షన్ పెంచడం లేదంటే… ముందుగానే విషయం చెప్పి కాస్త ఊరి పీల్చుకునేట్లు చేయడం. ఆటలో అరటిపండు అనుకున్నా…. సీరియస్ సీన్మాలో కమెడియన్ అనుకున్నా… లేదా ఆయనే అస్సలు హిరో అనుకున్నా ఇబ్బంది లేదు.  తెలంగాణ వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. అట్లాగే చేశారు.  ఈ విషయంలో మాత్రం  లగడపాటిని మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే నాయకులు మాట మీద ఉండరని అంటరు కదా. కానీ లగడపాటి మాత్రం అన్న మాట నిలబెట్టుకున్నారు.  ఎంతైనా నాయకుడు కదా తన  ఏదో విధంగా మీడియాల్లో పోలిటికల్ వర్గాల్లో సెంటర్ పాయింట్ అయ్యేందుకు ఈ సర్వేలు చేయిస్తున్నాడనే వాళ్లూ ఉన్నారు. ఎవరెమనుకున్నా… లగడపాటి ఈజ్ గ్రేట్ అనుకోవచ్చేమో.