బద్ధకం నేర్చిన గుర్రం..స్వారీ చేస్తే చనిపోయినట్టు నటన - MicTv.in - Telugu News
mictv telugu

బద్ధకం నేర్చిన గుర్రం..స్వారీ చేస్తే చనిపోయినట్టు నటన

October 22, 2019

చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ అన్న సామెతను అక్షరాల నిజం చేసింది ఈ గుర్రం. పని చెబుతున్నారని తప్పించుకునేందుకు నక్క జిత్తుల వేషాలన్ని వేస్తోంది. తన మాయ చేష్టలతో మనుషులను కూడా మించిపోతోంది. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ.. తిండి అంటే ఏనుగులా.. పని అంటే పీనుగులా చేస్తోంది. స్వారీ చేద్దామని ప్రయత్నించగానే.. చనిపోయినట్టు నటిస్తూ ఆస్కార్ స్థాయి నటనను కనబరుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. 

El caballo que se hace el muerto para que no le montén ??????

Posted by Frasisco Zalasar on Friday, 4 October 2019

ఫ్రసిస్కో జలసార్ అనే వ్యక్తి ఇటీవల తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. అందులో ఒక గుర్రం చేష్టలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానిపై ఎక్కి స్వారీ చేద్దామనేలోపు వెంటనే కిందపడిపోయి చనిపోయినట్టుగా నటిస్తోంది. అక్కడి నుంచి మనిషి వెళ్లిపోగానే తిరిగి లేచి మామూలుగా ఉంటోంది. ఇలా ఎన్నిసార్లు స్వారీ చేసేందుకు ప్రయత్నించినా మాట మాత్రం వినడంలేదు. అంతటితో ఆగకుండా బలవంతంగా దానిపైకి ఎక్కాలని ప్రయత్నిస్తే చిన్నపిల్లాడిలా కళ్లు కొట్టుకుంటూ మారాం చేస్తోంది. దీని నాటకాలు చూసిన నెటిజనులు దాని నటనకు తప్పకుండా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి గుర్రాన్ని తానెప్పుడు చూడలేదని దాన్ని పెంచుతున్న వ్యక్తి  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.