లఖింపూర్ ఖేరీ.. బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

లఖింపూర్ ఖేరీ.. బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి

April 18, 2022

car

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ పేరు వినగానే కేంద్ర మంత్రి కుమారుడు చేసిన హింసాకాండ గుర్తుకువస్తుంది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మకు చెందిన స్కార్పియో కారు బైకును ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్యే భార్య నీలం వర్మ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. మరోవైపు లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను కొట్టివేసింది. వారంలోగా నిందితుడు లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టును తప్పుపట్టింది.