Lakshmi's relatives crush Prakash in ananthapur
mictv telugu

ఏపీ : డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాశ్.. చితకబాదిన మహిళ బంధువులు

September 2, 2022

అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రకాశ్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ఎస్పీ ఆఫీసు ముందు ప్లకార్డు పట్టుకొని నిరసన తెలపడం తెలిసిందే. దీంతో సీరియస్ అయిన జిల్లా ఎస్పీ ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై చర్యలు తీసుకున్న ఎస్పీతో పాటు సంబంధం ఉన్న ఏఎస్పీ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని టూటౌన్‌లో కేసు పెట్టగా, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నిష్పక్షపాత విచారణ కోసం విచారణాధికారిగా ఇతర జిల్లాల అధికారులను నియమించాలన్న ప్రతిపాదన మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్యను నియమించారు. ఈ మేరకు అనంతపురం రేంజీ డీఐజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గంగన్న విచారణకు రావాలని ప్రకాశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా, అందుబాటులోకి రాకపోవడంతో ఇంటికి నోటీసులు పంపి, వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. ఇదిలా ఉండగా, ప్రకాశ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ బయటపడింది. అర్ధరాత్రి హౌసింగ్ కాలనీలోని లక్ష్మి అనే మహిళ ఇంట్లో అర్ధరాత్రి ఉండగా, మహిళ బంధువులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. మహిళ భర్త, బంధువులు ప్రకాశ్‌ని పట్టుకొని చితకబాదారు. లక్ష్మిని మాయ చేసి డబ్బులు, బంగారం అపహరించాడని భర్త ఆరోపించగా, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.