Lal Bahadur Shastri and Homi Baba died because of us: Ex-CIA Officer Reveals 
mictv telugu

లాల్ బహదూర్ శాస్త్రి, హోమి బాబాలను మేమే చంపాం : అమెరికా మాజీ అధికారి వెల్లడి

July 22, 2022

భారత దేశ దివంగత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో ఇన్నాళ్లుగా అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ రూమర్ల విషయంలో క్లారిటీ వచ్చింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ ఈ మేరకు తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఆవును పూజించే శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు, పార్శీ అయిన హోమీ జహంగీర్ బాబాను కూడా తామే విమానంలో బాంబు పెట్టి కూలిపోయేలా చేశామని రాబర్ట్ వివరించారు. జర్నలిస్ట్ డగ్లస్‌తో మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి హత్యల వెనుక గల కారణాలను రాబర్ట్ ఇలా చెప్పుకొచ్చారు. ‘వీరిద్దరూ చాలా నేర్పు కలవారు. వీరి నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెంది తమకు పోటీగా వస్తుందని అమెరికా భయపడింది. అప్పటికే రష్యాతో అంటకాగుతున్న భారత్.. అణ్యాయుధాలు కనుగొంటుందనే భయంతో సీఐఏ హత్యలకు ప్రణాళిక రచించింది. 1966లో 13 రోజుల వ్యవధిలో వీరిద్దరినీ హతమార్చాం. దీనికి పరోక్షంగా రష్యా కూడా సహకరించింది. అంతర్జాతీయ పరిణామాల పరిమితికి మించి అమెరికా, రష్యాల మధ్య ఎవ్వరికీ తెలియని ఓ రహస్య వ్యాపారం నడుస్తోంది. వీరిద్దరి హత్య తరువాత కూడా సీఐఏ అనేక ఆపరేషన్లను చేపట్టింది. భారతీయులు చాలా తెలివికలవారు. వారు ప్రపంచ శక్తిగా ఎదగడం మాకు నచ్చలేదు. అలాగే బియ్యం ఎక్కువగా తినే భారతదేశంలో వరి పంటను నాశనం చేసేందుకు వైరస్‌ ప్రయోగించాం. దీనికి కారణం అప్పటి చైనా నేత మావోనే.. అని దుష్ర్పచారం చేయాలనుకున్నాం. కుందేళ్లలాగా జనాభా పెంచుకుంటూ పోతున్న ఈ బియ్యం తినేవాళ్లను, పాములను పూజించేవాళ్లను పైకి ఎదగనీయకుండా కుట్ర పన్నాము’ అంటూ తమ కుట్ర, కుతంత్రాలను వెల్లడించారు.