గుండుకు మళ్లీ సున్నం.. ఈసారి ఫొటో తీసుకోకుండానే కొట్టేశారు..   - MicTv.in - Telugu News
mictv telugu

గుండుకు మళ్లీ సున్నం.. ఈసారి ఫొటో తీసుకోకుండానే కొట్టేశారు..  

December 15, 2017

గుండాయనకు మళ్లీ సున్నం కొట్టారు. ఆరు లక్షల నెక్లెస్‌ను బురఖా మహిళలు దోచుకెళ్లిన బాధ నుంచి  గుండూబాస్ కోలుకోక ముందే మరోసారి ఓ జంట బంగారాన్ని చాకచక్యంగా కొట్టేశారు. దీంతో సోమాజిగూడలోని లలితా జ్యుయెలరీలో కొనేవాళ్లకంటే కొట్టేసేవాళ్లే ఎక్కువని సరదాగా ప్రచారం జరుగుతోంది.

తాజా చోరీపై లలితా జ్యుయెలరీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఒక జంట షాపుకు వచ్చింది. నగల వివరాలు అడుగుతూ షాపంతా చక్కర్లు కొట్టింది.

ఆ రోజు బాగా రద్దీ ఉంది.. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు అందరిపైనా దృష్టి పెట్టలేకపోయారు. దీన్ని అదునుగా చూసుకుని ఆ జంట 66 గ్రాముల బంగారాన్ని నొక్కేసింది. ఇందులో 24.9 గ్రాముల బరువున్నజత గాజులు, 30 గ్రాముల బరువున్న మరో జత గాజులు, 10.700 గ్రాములున్న బరువున్న బ్రాస్ లెట్ ఉన్నాయి. ముసటి రోజు ఆడిట్ చేసేటప్పుడు ఈ విషయం తెలిసింది.

సీసీపుటేజీలను చూశాక ఆ జంట దొంగతనం చేసినట్లు తెలిసింది. సీసీ ఫుటేజీని పోలీసులకు అందించారు. ఇటీవల ఈ షాపులో ఒక నగను ఫొటో తీసుకుని అచ్చం అలాంటి నగనే తయారు చేయించిన మహిళలు దాన్నిషాపులో  మార్చేసి అసలు నగను పట్టుకెళ్లడం తెలిసిందే.