'డబ్బులెవరికీ ఊరికే రావు'.. రోడ్ సైడ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన గుండు బాస్ - MicTv.in - Telugu News
mictv telugu

‘డబ్బులెవరికీ ఊరికే రావు’.. రోడ్ సైడ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన గుండు బాస్

May 3, 2022

డబ్బులెవరికీ ఊరికే రావు.. ఈ ఒక్క డైలాగ్‌తో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ల‌లిత జ్యూవెల‌రీ అధినేత కిర‌ణ్ కుమార్. ఎప్ప‌టిక‌ప్పుడు ఓ కొత్త తరహా మార్కెటింగ్‌ ట్రిక్‌తో కస్టమర్లను ఆకర్షిస్తూ త‌న వ్యాపారాన్ని ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో ఈయ‌న‌కు మ‌రెవ‌రూ సాటీ లేరు. ఎటువంటి హంగు అర్భాటాల‌కు పోకుండా త‌న సెల్ఫ్ ప్ర‌మోట్ చేసుకుంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ గుండు బాస్.. త‌న తార‌క మంత్రం డ‌బ్బులెవ‌రికీ ఊరికే రావంటూ మ‌రోసారి నిరూపించాడు.

తాజాగా ఆయ‌న ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. స్టార్ హోట‌ల్‌లో తిన‌గ‌లిగే స‌త్తా ఉన్న‌ప్ప‌టికీ రోడ్ సైడ్ హోట‌ల్‌లో వ‌ద్ద స్నేహితులతో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మార‌డంతో నెటిజ‌న్లు ఆయ‌నపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కిర‌ణ్ కుమార్ వ‌య‌సు 50ఏళ్ళు.1985 లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు.ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999 లో లలిత జ్యువెలర్స్ సంస్థను టేకోవర్ చేశారు.