లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం తగ్గిన సంగతి తెల్సిందే. ఉద్యోగులకు మొత్తం జీతం కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. ఈ విపత్కర సమయాల్లో ప్రభుత్వానికి డబ్బు ఎంతో అవసరం. ఈ విషయం అర్థం చేసుకున్న కొందరు దాతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయంగా సీఎం, పీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్నారు.
తాజాగా లలితా జ్యువెలరీస్ అధీనేత కిరణ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్ ను ఆయన ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో కలిసి చెక్కును అందచేశారు. ఇటీవల తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలకు చెరో కోటి రూపాయల విరాళం అందించారు.