గుండు‌కు సున్నం కొట్టిన ఆడ లేడీస్ - MicTv.in - Telugu News
mictv telugu

గుండు‌కు సున్నం కొట్టిన ఆడ లేడీస్

December 9, 2017

లలిత జ్యుయెలరీలో మీకు నచ్చిన నగను  ఫోటో తీసుకోండి..  నాలుగైదు షో రూంలలో కంపార్ చేయండి. ఎక్కడ ధర తక్కువైతే అక్కడ కొనండి..’ అన్న గుండుబాస్ మాటల్ని ఇద్దరు బురఖా లేడీస్ ఇంకో రకంగా అర్థం చేసుకున్నరు. అందుకే నచ్చిన నగను ఫోటో తీసుకున్నరు. కాని నాలుగైదు షో రూంలలో కంపార్ మాత్రం చేయలేదు.

ఎక్కడనో  సేమ్ టూ సేమ్ దానికి ఓ నకిలీని తయారుచేయించిన్రు. మళ్లీ లలితకు వచ్చి ఒరిజినల్ ను తీసి ఆ డూప్లికేట్‌ను పెట్టిన్రు. ఈ మొత్తం తతంగాన్ని చాలా కేర్‌ఫుల్ గా పూర్తి చేసిన్రు. అందుకే ఎవరికీ అనుమానం కూడా రాలేదు. సీసీ కెమెరాల ఫుటేజ్ చూసిన తర్వాతనే దొంగతనం జరిగినట్టు తెలిసింది.

దీంతో పంజగుట్ట  పోలీస్ స్టేషన్లో షోరూం మేనేజర్ ఫిర్యాదు చేసిండు. అన్నట్టు ఆ నగ ధర ఆరు లక్షల రూపాయలు. అవును మరీ డబ్బులు ఊరికే రావుగ.