పీక మీద కాలు పెట్టినా.. లాలూ ఎందుకు లొంగలేదు ? - MicTv.in - Telugu News
mictv telugu

పీక మీద కాలు పెట్టినా.. లాలూ ఎందుకు లొంగలేదు ?

July 27, 2017

లాలూ బిజెపితో ఎందుకు కలవలేక పోయారు?జేడియూ కంటే సంఖ్యా పరంగా లాలూదే పైచేయి,అయినా బిజెపి సంకనెక్కలేదు,ఎందుకంటారు?ఇప్పుడంతా ఇదే చర్చ.సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించిన కమలం బెదిరింపులకు లాలూ ప్రసాద్ లొంగకపోవడానికి వెనక ఉన్న ఆంతర్యం ఏమై ఉంటుంది?లాలూ నమ్మిన సిద్దాంతాలే కారణమా?లాలూ అవినీతి పరుడైతే బిజెపి బెదిరింపులకు లొంగాలి కదా? మరెందుకు లొంగలేదు?ఈ ప్రశ్నలు కనీస రాజకీయ పరిజ్ఝానం ఉన్న ఎవరినైనా వెంటాడతాయి.

2014 ఎం.పి ఎన్నికల్లో పాతాళానికి జారిపోయిన జేడియూకి,ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ జెడీ లాలూ ప్రసాద్ ప్రాణం పోసారనేది రాజకీయ వర్గాలు అంటున్న మాట.రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి నితీష్ తో జతకట్టి దేశ రాజకీయాలకు కొత్త పాఠాలు అందించారు లాలూ.2015 ఎన్నికల్లో 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవీర్భవించిన ఆర్ జెడీ ముఖ్యమంత్రి పదివి తీసుకోలేదు.ఎందుకంటే ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ సగర్వంగా అమలు చేసారు.అయితే బీహార్ లో జరిగిన నితీష్ రాజకీయ డ్రామా బిజెపితో నితీష్ ప్రారంభమైన ప్రయాణం లాలూ గ్రాఫ్ ని పెంచుతాయి కానీ తగ్గించవనేది పొలిటికల్ అనలిస్ట్ లు చెబుతున్న మాట.కొడుకు రాజకీయ అవినీతిని చూసీ చూడనట్టు వ్యవహరించిన లాలూ నితీష్ కుమార్ విషయంలో కూడా అలాగే వ్యవహరించినట్టు కనిపిస్తుంది.మొత్తానికి లాలూ ప్రమేయం లేకుండానే నితీష్ కుమార్ కాషాయపు గుంపులో శెరీకై పోయారు.