Lalu Prasad Yadav To Be Airlifted To Delhi For Treatment
mictv telugu

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

July 6, 2022

Lalu Prasad Yadav To Be Airlifted To Delhi For Treatment

బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. బుధవారం లాలును పాట్నా నుంచి హుటాహుటిన ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆయన వెంట భార్య రబ్రీదేవీ, ఇద్దరు కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్, తేజస్వి యాదవ్‌, కుమార్తె మిసా భారతి వెళ్లనున్నారని పేర్కొన్నాయి. గతంలో కూడా ఆయన ఎయిమ్స్‌లో వైద్య సహాయం పొందారు.

మెట్లపై నుంచి జారిపడిన గాయాలతో పాటు ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ.. ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. లాలూ మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఆయన బాధపడుతున్నారు. మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.

పాట్నా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీకి తరలించే ముందు ఆస్పత్రిలో లాలు యాదవ్‌ను బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పరామర్శించారు. అయితే చికిత్సకు లాలు యాదవ్ స్పందిస్తున్నారని , త్వరలోనే కోలుకుంటారని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.