లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష.. రూ.60 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష.. రూ.60 లక్షల జరిమానా

February 21, 2022

09

దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌కు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో పాటు లాలూకు రూ.60 లక్షల జరిమానాను కూడా విధించింది. 25 ఏళ్ల విచారణ తరువాత దాణా స్కాంలోని ఐదో కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూను గత వారం దోషిగా తేల్చడం తెలిసిందే. 1990, 1995 మధ్య కాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఇది దాణా కుంభకోణంలో ఐదో కేసు మాత్రమే కాకుండా, అతిపెద్ద కేసు కూడా. ఈ కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.

పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు. అయితే, ఇది తుది తీర్పు కాదని, సీబీఐ కోర్టు తీర్పును లాలూ ప్రసాద్ యాదవ్ హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు.