దేశంలో అత్యంత అర్హత లేని ముఖ్యమంత్రి అని ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి మళ్లీ వార్తల్లో నిలిచారు. సొంత పార్టీ కార్యకర్తలపై చేయి చేసుకుంటూ వీడియోకు చిక్కారు. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను అల్లరి చేస్తున్నారంటూ ఆమె చేత్తో కొట్టారు.
CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj
— देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022
లాలూపై నమోదైన రైల్వే అవినీతి కేసులో శుక్రవారం ఆయన ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. దీన్ని నిరసిస్తూ ఆర్జేడీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లరి చేస్తున్నరంటూ రబ్రీ దేవి వారిపై చేయి చేసుకున్నారు. కార్యకర్తలు సీబీఐ అధికారులను దాడుల తర్వాత బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం వల్లే ఆమె చేయి చేసుకున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నారు. రైల్వే అవినీతి కేసులో లాలూతోపాటు రబ్రి కూడా నిందితురాలే.