బీహార్ లో మహా ఘడ్భందన్ మటాష్..! - MicTv.in - Telugu News
mictv telugu

బీహార్ లో మహా ఘడ్భందన్ మటాష్..!

July 26, 2017

అది 2015… దేశ రాజకీయాల్లోనే  పెను మార్పులు చోటు చేసుకున్న సంవత్సరం,బీహార్ లో బద్ధ శత్రువులైన ఆర్జేడి,జేడియూ, కాంగ్రెస్ పార్టీలలో పాటు మరికొన్ని పార్టీలతో మహా ఘడ్భందన్ అనే పేరుతో ఒకటయ్యారు,దేశంలోనే ఒక రాజకీయ సంచలన కూటమిగా  ఏర్పడి ఊపుమీదున్న  బిజెపికి..మహా షాక్ నే ఇచ్చారు, వాళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అనుకున్నట్టే భారీ మెజారిటీతో నితీష్ కూమార్ ,లాలూ ప్రసాద్ , కాంగ్రెల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.దీంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ,ఉప ముఖ్కమంత్రిగా లాలూప్రసాద్.. పుత్ర రత్నం తేజస్వి లు గద్దెనెక్కారు,అయితే రాజకీయ విశ్లేషకులు..ఈ కూర్పు మూడు నెలలు కూడా ఉండదని విశ్లేషించారు ఆనాడు.కానీ అటు ఇటుగా రెండ్లేన్ల పాటు ఈ మహా ఘడ్భందన్ ను నితీష్ బాగానే నెట్టుకొచ్చాడు.లాలూ ప్రసాద్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలు సిబిఐ కలుగ జేసుకోవడం,ప్రభుత్వం నుండి ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునేది లేదని..కనీసం ప్రజలకు వివరణ కూడా ఇవ్వాల్సిన అవుసరం లేదనే లాలూ మొండితనం..ఈ మహా ఘడ్బందన్ మటాష్ కు కారణమైంది.

ఈ కూటమిని నిలబట్టాలనే కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రయత్నం విఫలం..!

నితీష్ ,లాలూ ల మద్యనున్న అంతర్గత విభేదాలను చాలా దగ్గరనుంచి పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిద్దరి మధ్య సయోధ్యను కూర్చే ప్రయత్నం చేసింది.సోనియా గాంధీ,రాహుల్ గాంధీ  వీరి ఐక్యతను నిలబెట్టడానికి విఫల ప్రయత్నాలే చేసారు,కానీ వారి  మధ్యవర్తిత్వం ఫలించలేదు.