పోలీస్ ఠాణా స్థలాన్ని పోచమ్మ కబ్జా చేసింది! - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ ఠాణా స్థలాన్ని పోచమ్మ కబ్జా చేసింది!

March 28, 2018

కాస్తా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాసురులు టక్కున వాలిపోతారు. బెదిరించి, భయపెట్టి, తరిమేయడం పాత స్టయిల్. దేవుళ్లను ప్రతిష్టించి, భక్తిప్రపత్తులతో కబ్జా చేయడం కొత్త స్టయిల్. మంచిర్యాల మండలం భీమారంలో పోలీస్ ఠాణా నిర్మించడానికి కేటాయించిన స్థలాన్ని భూబకారులు దుర్మార్గులు పోచమ్మ పేరు చెప్పి ఆక్రమించారు.

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత భీమారం మండలమైంది. మోడల్ పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం ప్రస్తుత పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని అధికారులు కేటాయించారు. అయితే అక్కడ రాత్రికి రాత్రే అక్రమార్కులు పోచమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, చుట్టూ కాషాయ జెండాలు పాతి హల్‌చల్ చేశారు. అక్కడ పోచమ్మ స్వాయంభువుగా వెలసిందని, కోరిక కోరికలు(తమ కోరికలు కూడా!) నెరవేస్తుందని బూటకపు ప్రచారం చేశారు. దీంతో జనం తండోపతండాలుగా వచ్చి పూజలు చేస్తున్నారు. ఇది తెలిసి పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ స్థలాన్ని కొట్టేయాలనే ఓ స్థానిక నేత పోచమ్మను ప్రతిష్టించినట్లు ఆరోపిస్తున్నారు.