Land for jobs scam case : ED Raids On Bihar Deputy CM Tejashwi Yadava On Land for jobs scam case
mictv telugu

Land for jobs scam case : ఉప ముఖ్యమంత్రి ఇంటిపై ఈడీ దాడులు

March 10, 2023

Land for jobs scam case : ED Raids On Bihar Deputy CM Tejashwi Yadava On Land for jobs scam case

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిలో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ మధ్యనే లాలూ, ఆయన భార్య రబ్రీదేవిని సీబీఐ విచారించింది. రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లాలూ ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈడీ ఈ దాడులను నిర్వహిస్తోంది. తాజాగా ఆయన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి పదులకుపైగా ప్రాంతాల్లో సోదాలు జరిపింది. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులను విడిచిపెట్టలేదు. మనీలాండరింగ్ కేసులో సాక్ష్యాలను గుర్తించేందుకే ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. 204-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబీకులు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు బేస్ చేసుకుని తాజాగా సీబీఐ లాలూను విచారించగా, తాజాగా ఈడీ ఆయన కుమారుడు ఇంట్లో సోదాలను నిర్వహిస్తోంది.