తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇందులోని ప్రధాన అంశాలు..
1. గతంలో జారీ చేసిన జీవోలు 58, 59ను కొనసాగిస్తాం.
2.జీవో 59 కింద రూ. వెయ్యి చెల్లించి, దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వమే క్రమబద్ధీకరిస్తుంది.
3. ఆస్తి విలువలో 12.5 శాతాన్ని చెల్లించే నిబంధన తొలగింపు.
4. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం.
5. అంతకు మించి భూమి ఉంటే రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా వసూలు చేస్తామని పేర్కొంది.
అంతేకాకుండా..
6. భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి ఆధారు కార్డు, ఆక్రమిత స్థలంలో 2014 జూన్ 2కు ముందు నుంచి ఉంటున్నట్టు ధ్రువీకరణ పత్రం.
7. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు.
8. విద్యుత్ బిల్లు.
9. వాటర్ బిల్లు.
10. నివాస ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైనా కట్టిన రూ. వెయ్యి డబ్బును వెనక్కి ఇవ్వమని స్పష్టం చేసింది.