Land settlers organized the agitation in husnabad
mictv telugu

హుస్నాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ప్రజా ప్రతినిధులపై నిర్వాసితుల దాడి

June 14, 2022

Land settlers organized the agitation in husnabad

సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆందోళన తీవ్రమైంది. గుడాటిపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా, మంగళవారం ఎమ్మెల్యే సతీష్ కుమార్ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వాసితులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య వాగ్వాదం జరుగగా, కొందరు నిర్వాసితులు ఆగ్రహంతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులపై భౌతిక దాడికి దిగారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు, ఆయన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. హనుమ కొండ – హుస్నాబాద్ ప్రధాన రహదారిపై వంటా వార్పు, రాస్తారోకో నిర్వహించారు. కాగా, ఆదివారం రాత్రి పోలీసులు నిర్వాసితులపై బలప్రయోగం చేసిన విషయం తెలిసిందే.