Landmark verdicts India's new CJI DY Chandrachud
mictv telugu

తండ్రికి తగ్గ తనయుడు

November 9, 2022

Landmark verdicts India's new CJI DY Chandrachud

సుప్రీంకోర్టు..దేశ అత్యున్నత న్యాయస్థానం. అందులో ముఖ్యపదవి. నాన్న కూర్చున్న పదవిలోనే 37 ఏళ్ల తర్వాత కొడుకు కూర్చుంటే…అద్భుతం. పైగా తండ్రి ఇచ్చిన తీర్పుల్నే తిరగరాసి కొత్త చరిత్ర సృష్టిస్తే మహాద్భుతం.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ విషయంలో ఇదే జరిగింది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమే కాదు విలక్షణమైన తీర్పులు ఇచ్చి సరికొత్త సృష్టించారు.

విలక్షణమైన తీర్పులు

నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు,కేరళ హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసులు గుర్తున్నాయి కదా..ఈ తీర్పులు ఇచ్చిందో ఎవరో తెలుసా…సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్..ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎంతో పరిణతి చెందిన తీర్పులు ఇచ్చారు. రెండేళ్లపాటు సీజేఐగా ఆయన ఉంటారు.

సరికొత్త చరిత్ర

డీవై చంద్రచూడ్ తండ్రి యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ( వైవీ చంద్రచూడ్‌) సుప్రీంకోర్టు 16వ న్యాయమూర్తిగా పనిచేశారు. 1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జూలై 11 వరకు 7 సంవత్సరాలపాటు సీజేఐగా ఉన్నారు. తండ్రి పదవీ విరమణ చేసిన 37 ఏళ్ల తర్వాత తనయుడు అదే పదవిలో కూర్చున్నారు. ఇది దేశ చరిత్రలో తొలిసారి. తండ్రి తీసుకున్న రెండు నిర్ణయాలను డీవై చంద్రచూడ్ తోసిపుచ్చి నయా చరిత్ర సృష్టించారు.

Landmark verdicts India's new CJI DY Chandrachud

ఆ రెండు కేసులు

తండ్రి వైవీ చంద్రచూడ్‌ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్‌ శుక్లా వర్సెస్‌ ఏడీఎం జబల్‌పూర్‌ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్‌ తోసిపుచ్చారు.

మొదటి కేసు

1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్‌ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్‌ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.

రెండో కేసు

1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్‌ ఏడీఎం జబల్‌పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని చెప్పింది. ఈ బెంచ్‌లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కానీ 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్‌లో డీవై చంద్రచూడ్‌ ఉన్నారు. ‘ఏడీఎం జబల్‌పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్‌ తీర్పుని వెలువరించారు.

సవాళ్ల స్వాగతం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డీవై చంద్రచూడు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. చతురతతో వాటిని నెగ్గుకొస్తారని న్యాయనిపుణులు చెబుతున్నారు.తండ్రి అధిష్టించిన అత్యున్నత పదవి నుంచి కొడుకు తీర్పులు ఇవ్వడం మరో చరిత్ర అంటున్నారు.