మనం మాట్లాడే భాషలెన్నో తెలిస్తే షాక్ అవుతారు..... - MicTv.in - Telugu News
mictv telugu

మనం మాట్లాడే భాషలెన్నో తెలిస్తే షాక్ అవుతారు…..

August 4, 2017

మన దగ్గర ఎన్ని భాషలున్నాయో తెలుసా అని ఎవరైనా అంటే….ఏ ఎన్ని ఓ పది.. ఇరవై అని బుక్కుల్లో చదువుకున్న 22 భాషల గురించి చెప్తారు. ఇంకాస్త చదువుకున్న వారైతే వందో, రెండు వందలో అంటారు. అదే కనుమరుగైన భాషల గురించి చెప్పమంటే… ఏమో అంటారు కదా. మన ఇండియాలోని 130 కోట్ల మంది జనం మాట్లాడుతున్న భాషల సంఖ్య అక్షరాల 780 అట. పీఎస్ ఎల్ఐ ధ్వర్యంలో భారతీయ భాషలపై సర్వే  చేశారు. అందులో ఈ విషయం తేలింది. అంతేకాదు కేవలం 50 యేండ్ల కాలంలో మన దగ్గర 400 భాషలు కనమరగయ్యాయట. ఇప్పుడు భాష అంటే  వెంటనే గుర్తుకు వచ్చేది ఇంగ్లీషు మాత్రమే.

వెయ్యి యేండ్ల చరిత్ర కలిగిన మైథిలీ  అనే గిరిజన భాష కూడా అంతరించి పోయిందని అంటున్నారు సైంటిస్టులు. మన దగ్గరే కూలానికో భాష ఉంటుంది. ఒక్క గ్రామంలోనే  డజను వరుకు భాషలుండేవి. వృత్తి కులాల వారికి కైతే ఖచ్చితంగా భాస ఉంటుంది. ఇట్లా వందల వేల భాష లు అంతరించి పోయాయి. ఇప్పుడు  సుమారు 6 వేల భాషలపై ఈ సంస్థ వారు ఓ డాక్యూమెంట్ తయారు చేస్తామని అంటున్నారు.