లాన్డౌన్తో 40 రోజులు పైబడి చుక్క మద్యం లేక ఓపిక పట్టీపట్టీ ఇప్పుడు వారు పట్టు తప్పిపోయారు. మద్యం షాపులకు ఉరకలు, పరుగులు పెడుతున్నారు. ఇంట్లో సరుకులు అడ్వాన్స్‌గా తెచ్చి పెట్టుకున్నట్టు కేసులకు కేసులు మందు కాటన్లు తెచ్చుకుని ఇళ్లల్లో స్టాక్ పెట్టుకుంటున్నారు. ఒక్క సీసా, రెండు సీసాలు కొనే పాపానికి ఎవరూ వెళ్లడం లేదు. అలాంటి ఓ వీడియోని నటుడు సునీల్ గ్రోవర్… తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో థాయ్‌ల్యాండ్‌లోని ఓ సూపర్ మార్కెట్లోకి బీర్ కాటన్లు తీసుకెళ్తుండగా… మధ్యలోనే అడ్డుకున్న మందుబాబులు… ఎవరికి దొరికిన బీర్ బాటిల్ కేసును వాళ్లు లాగేసుకున్నారు. అసలు కరోనా వైరస్ ఉందన్న సంగతే మర్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవాళ్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాగైతే కరోనా మళ్లీ విజృంభించడం ఖాయమే అంటున్నారు.
‘మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించినా విజృంభించవచ్చు.. లాక్డౌన్ మళ్లీ మళ్లీ పొడిగిస్తే మందు లేకుండా ఉండటం మావల్ల కాదని కాబోలు.. కేసుల కొద్దీ మందును తీస్కెళ్తున్నారు’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. భౌతిక దూరం, ముఖానికి మాస్కు వంటి నిబంధనలు అన్నీ మరిచిపోయిన దృశ్యాలు దేశవ్యాప్తంగా కనిపించాయి. మామూలు రోజుల్లో ఉన్నట్టే మద్యం షాపుల వద్ద జనాలు గుమికూడారు. దాచుకున్న డబ్బంతా తీసుకొచ్చి మద్యం షాపుల్లో కుమ్మరించి… మద్యం బాటిళ్లు కొనుక్కుంటున్నారు. ఒక్క ఏపీలోనే మద్యం కోసం క్యూ కడుతున్నారు. మిగతా రాష్ట్రాలన్నింటిలో తోపులాటలే ఉన్నాయి. కాగా, మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు భగ్గముంటున్నాయి. దేశంలో మార్చి 24న లాక్డౌన్ విధించినప్పుడు.. వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు కూడా లేవు. ఇప్పుడు ఏకంగా 42 వేల కేసులు ఉన్నప్పుడు ఎందుకు మద్యం అమ్మకాలకు ప్రారంభించారు? అని ప్రశ్నిస్తున్నాయి.