తెలంగాణ రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఒకేసారి భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు సహా దాదాపు 60 మంది బదిలీపై వేరే స్థానానికి బదిలీ కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో సిరిసిల్ల, పాలమూరు, వనపర్తి, నల్లగొండ ఎస్పీలు ఉన్నారు. కరీంనగర్, రామగుండం, సీపీలు, హైదరాబాద్, రాచకొండ పరిధిలోని డీసీపీలు పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒకేచోట దీర్ఘకాలంగా పోస్టింగులో ఉన్నవారు కూడా ఈ బదిలీల్లో ఉండడం గమనార్హం. రామగుండం సీపీగా సుబ్బారాయుడు, మల్కాజ్ గిరి డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం సీపీగా సురేశ్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. కాగా, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.